![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-6 తర్వాత సరికొత్త షో మొదలైంది. బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లోని కంటెస్టెంట్స్ తో కలిసి డ్యాన్స్ షో మొదలుపెట్టారు. అదే ఇప్పుడు 'బిబి జోడి'. అయితే ఇప్పుడు ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఈ షోలో యాంకర్ గా శ్రీముఖి, జడ్జ్ లుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ ఉన్నారు.
మొన్న జరిగిన డ్యాన్స్ షోలో అరియానా, అవినాష్ కలిసి జోడిగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత రాధ మాట్లాడుతూ "డ్యాన్స్ చింపేశారు. లవ్ యూ" అని చెప్పింది. దానికి యాంకర్ శ్రీముఖి "మేడమ్.. లవ్ యూ అవినాష్కా..లేక అరియానాకా" అని అడిగేసరికి, "ఇద్దరికి" అని చెప్పింది రాధ. ఆ తర్వాత "అవినాష్ నువ్వు ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీసావ్" అని రాధ చెప్పింది. "మేడమ్.. మరి అరియానా?" అని శ్రీముఖి అడుగగా, "తనని చూసి నాకు జెలస్ గా ఉంది. ఆ షేప్ చూడండి" అని రాధ అనేసరికి, షోలో అరుపులు, విజిల్స్ తో మారు మ్రోగింది. ఆ తర్వాత "కోఠీలో చేయించింది మేడమ్" అని అవినాష్ జోక్ చేసాడు.
'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో' పాటకి అవినాష్ , రాధ కలిసి స్టెప్పులేశారు. అయితే అరియానాని హాట్ అని రాధ చెప్పిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
![]() |
![]() |